అదిరిపోయే స్టిల్‌తో శంకర్‌ విషెస్‌

0
2
Director Shankar Wishes Kamal Hasan With Indian2 Still - Sakshi

కమల్‌ కొత్త స్టిల్‌ను విడుదల చేసిన డైరెక్టర్‌

చెన్నై: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ గురువారం భారతీయుడు-2 మూవీ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సుమారు 23 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2లో కమల్‌ లుక్‌ ఎలా ఉంటుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులను.. సర్‌ప్రైజ్‌ చేశాడు. విలక్షణ నటుడు కమల్‌ – ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారతీయుడు‌-2 సినిమాలో ఆయన మరోసారి సేనాపతిగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా కమల్‌ తన పుట్టిన రోజు వేడుకల కోసం భారతీయుడు-2 సినిమా షూటింగ్‌కు 3 రోజుల పాటు బ్రేక్‌ చెప్పి‌.. తన స్వగ్రామం పరమక్కుడిలో 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహన్ని ఆవిష్కరించారు

View image on Twitter

ఇక కమల్‌ హాసన్ ఇండియన్(1996) సినిమాలో అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను హడలెత్తించే సేనాపతి పాత్రలో.. విశ్వరూపం చూపి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. కాగా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here