అఖిల్ సినిమా పై నాగార్జున పూర్తి దృష్టి కొన్నిసీన్స్ రీ షూట్…

0
35

Image result for nagarjuna,akhil latest images

తనయుల సినిమాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు నాగార్జున. తన సినిమాలతో పాటు అఖిల్, నాగ చైతన్య సినిమాలపై కూడా కన్నేసి ఉంచుతాడు. ఇప్పుడు కూడా అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై నాగార్జున పూర్తి ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ మధ్యే ఫైనల్ కట్ చూసినట్లు ప్రచారం జరుగుతుంది. బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత భాస్కర్‌ను ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు. అలాంటి దర్శకుడు చెప్పిన కథ నచ్చి అఖిల్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సినిమాలో కొన్ని సన్నివేశాలపై నాగార్జున అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని రీ షూట్ చేయాలని దర్శకుడికి నాగార్జున సూచించినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ గతంలో కూడా కొన్ని సినిమాలకు రీ షూట్ చేయించాడు. రీ షూట్ చేస్తే సినిమా బాగోకపోవడం కాదు.. ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం అని నాగార్జున అన్నారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా షూట్ చేయాలని ప్రయత్నించాలని బొమ్మరిల్లు భాస్కర్‌కు నాగార్జున చెప్పినట్లు వెల్లడించారు.

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు నాలుగో సినిమాపై ఆశలు బాగానే పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో నాగార్జున కూడా కొడుకు సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. సినిమాను ఎప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నా కూడా అనుకోకుండా అవి మరో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా కూడా ఉండటంతో ఇప్పట్లో సినిమాలు విడుదల చేయకూడదని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. అందులో బన్నీ వాసు కూడా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. మొత్తానికి నాగార్జున సూచించిన మార్పులు సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here